రాజధాని అమరావతి అనువుగా కడితే... సినిమా షూటింగులూ అక్కడే : దాసరి
విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణాన్ని అనువుగా కడితే... తెలుగు సినిమా షూటింగులు అక్కడే చేస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పారు. విజయవాడలో ఆయన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. మూడు సంవత్స
విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణాన్ని అనువుగా కడితే... తెలుగు సినిమా షూటింగులు అక్కడే చేస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పారు. విజయవాడలో ఆయన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. మూడు సంవత్సరాల తర్వాత దుర్గమ్మను దర్శించుకునే భాగ్యం తనకు మళ్ళీ కలిగిందని దాసరి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబును కలుద్దామని అనుకున్నానని, అయితే ఈసారి ఆ అవకాశం కుదరలేదని బాధగా ఉందని దాసరి చెప్పారు. అయినా ఆయన అమరావతి నిర్మాణాన్ని చేస్తే, షుటింగ్‌లకు అనువైనదిగా ఉంటే, ఇక్కడే షూటింగులు జరుగుతాయని దాసరి చెప్పారు.