శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (12:44 IST)

ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి సూపర్ విలన్ ఫస్ట్ లుక్

Manish Gilada
Manish Gilada
శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా "ఏ మాస్టర్ పీస్". అరవింద్ కృష్ణ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి  తాజాగా సూపర్ విలన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మనీష్ గిలాడా ఈ సూపర్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
 
ఫస్ట్ లుక్ లో విలన్ డేట్ ఆఫ్ బర్త్ మూడుసార్లు, డేట్ ఆఫ్ డెత్ రెండు సార్లు రాయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. 1960లో పుట్టి 1986లో చనిపోయిన ఈ సూపర్ విలన్ మళ్లీ 1986లో పుట్టి 2010లో మరణిస్తాడు. తిరిగి 2010 లో పుట్టి ఎప్పుడు కన్నుమూస్తాడు అనేది ప్రశ్నార్థకంతో ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. వైవిధ్యమైన కథాంశం ఈ సినిమాలో ఉన్నట్లు విలన్ క్యారెక్టర్ లుక్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఏ మాస్టర్ పీస్ సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. గతంలో ఈ సినిమా నుంచి విడుదల చేసిన హీరో అరవింద్ కృష్ణ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
స్నేహ గుప్త, అర్చనా అనంత్, జ్యోతి రాయ్, జయప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ- శివరామ్ చరణ్, సంగీతం- ఆశీర్వాద్, ఎడిటర్ - మనోజ్ కుమార్. బి, కాస్ట్యూమ్స్ - రియా పూర్వజ్, సలీనా విలియమ్స్, యూకే, స్టంట్స్ - రాజ్ కుమార్ గంగపుత్ర, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాత - శ్రీకాంత్ కండ్రేగుల, రచన దర్శకత్వం - సుకూ పూర్వజ్.