శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Vasu
Last Modified: గురువారం, 4 జనవరి 2018 (18:36 IST)

అక్కినేని నాగార్జున అందరిలో ఒకరు... అంతేనట, కేంద్రం లైసెన్స్ రద్దుపై...

తమ పార్టీకి వ్యతిరేకంగా లేదా తమ పార్టీకి మద్దతు ప్రకటించని ప్రముఖులపై ఐటీ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు చేయిస్తున్నారంటూ ఇప్పటికే అపవాదులను మూటగట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్గజాలలో ఒకరైన నాగార్జునకు సంబంధించిన అక

తమ పార్టీకి వ్యతిరేకంగా లేదా తమ పార్టీకి మద్దతు ప్రకటించని ప్రముఖులపై ఐటీ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు చేయిస్తున్నారంటూ ఇప్పటికే అపవాదులను మూటగట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్గజాలలో ఒకరైన నాగార్జునకు సంబంధించిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌కు చెందిన ఎఫ్‌సిఆర్‌ఎ (విదేశాల నుండి నిధులను పొందే సౌలభ్యం) లైసెన్స్‌ను రద్దు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
అయితే అసలు విషయంలోకి వెళ్తే, దేశవ్యాప్తంగా విదేశాల నుండి విరాళాలను అందుకుంటున్న ఎన్జీవోలన్నీ తమ వార్షిక ఆదాయ వివరాలను అందించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఆదేశాలను బేఖాతరు చేసిన నేపథ్యంలో, సదరు వివరాలను అందించని పలు దాతృత్వ సంస్థలకు (ఎన్జీవో) చెందిన ఎఫ్‌సిఆర్ఎ లైసెన్స్‌‌లను రద్దు చేస్తూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇది జరిగినట్లు చెపుతున్నారు.
 
అంతకుమించి సదరు సినీ దిగ్గజం ఎటువైపున్నా ఒరిగేదేమీ లేదని పలువురు విశ్లేషకులు ఊహిస్తున్నారు. ఈ లైసెన్స్ రద్దు చేయడం ద్వారా సదరు ఎన్జీవోలు విదేశాల నుండి ఎటువంటి విరాళాలను పొందలేకపోవడం కొసమెరుపు.