శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (16:06 IST)

ఆకట్టుకుంటోన్న త్రిగుణ్, ఆయుషి పటేల్ ‘చూసుకో’ వీడియో సాంగ్

chusuko song poster
chusuko song poster
ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ప్రైవేట్ సాంగ్స్‌ను కూడా సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం తగ్గకుండ భారీ ఎత్తున రూపొందిస్తున్నారు. ఆ రిచ్ చూసి అంతా షాకయ్యేలా ఉంటుంది. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో యంగ్ హీరో, హీరోయిన్‌లు మెరిశారు. ఎన్నో చిత్రాలతో ఆకట్టుకున్న త్రిగుణ్.. 'కలియుగం పట్టణంలో' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల  ముందుకు రాబోతోన్న ఆయుషి పటేల్ కలిసి ‘చూసుకో’ అనే వీడియో ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
 
చూసుకో అంటూ సాగే ఈ పాటను యంగ్ సెన్సేషన్ యశస్వి కొండెపూడి, హరిణి ఇవటూరి సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని సురేష్ బాణిశెట్టి అందించగా.. అన్వేష్ రావు కగిటాల బాణీని సమకూర్చారు. చూసుకో అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళలోని అందమైన విజువల్స్‌ను మరింత అందంగా చూపించారు. త్రిగుణ్, ఆయుషి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
 
ప్రస్తుతం ఆయుషి పటేల్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.  మార్చి 22న కలియుగం పట్టణంలో అనే చిత్రంతో ఆయుషి పటేల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరో మూడు ప్రాజెక్టులు చిత్రీకరణలో ఉన్నాయి. మరో వైపు త్రిగుణ్ సైతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అచ్చ తెలుగమ్మాయి అయిన ఆయుషి అందాలు ఈ పాటకు ప్రధాన ఆకర్షణ.