బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (14:19 IST)

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కలియుగం పట్టణంలో

kaliyuga pattanamlo  poster
kaliyuga pattanamlo poster
డిఫరెంట్ కాన్సెప్టులతో వచ్చే చిత్రాలు ఇప్పుడు ఆడియెన్స్‌ను బాగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఓ కొత్త కథాంశంతోనే ‘కలియుగం పట్టణంలో’ అనే చిత్రం రాబోతోంది. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
 
తొలి ప్రయత్నంగా ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు రమాకాంత్ రెడ్డి ప్రయోగం చేశారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా బాగా రావడంతో చిత్రయూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నారు.