బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (17:22 IST)

సస్పెన్స్ త్రిల్లర్ తో హీరో విశ్వ కార్తికేయ చిత్రం

Hero Vishwa Karthikeya with shooting team
Hero Vishwa Karthikeya with shooting team
బాలనటుడిగా కెరీర్ ఆరంభించి, నటసింహం బాలకృష్ణ, బాపు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లాంటి ఎంతో మంది  స్టార్స్‌తో వర్క్ చేసిన విశ్వ కార్తికేయ.. ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం లైనప్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన పుట్టినరోజు రావడంతో రామా క్రియేషన్స్, నాని మూవీ వర్క్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ యూనిట్ ఈ వేడుకను ఘనంగా నిర్వహించింది. సినిమా సెట్స్ లోనే నిర్వహించిన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో చిత్ర యూనిట్ తో పాటు దర్శకుడు రమాకాంత్ రెడ్డి పాల్గొని ఆయనకు బెస్ట్ విషెస్ చెప్పారు.
 
రామా క్రియేషన్స్ అండ్ నాని మూవీ వర్క్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ రూపొందుతోంది. ఈ సస్పెన్స్ త్రిల్లర్ మూవీలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
 
చైల్డ్ ఆర్టిస్ట్ గా సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించిన విశ్వ కార్తికేయ.. ఆ నలుగురు సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నంది అవార్డు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, స్టేట్ అవార్డు ఫర్ మెరిటోరియస్ అచివేమెంట్ లాంటి ఎన్నో అచీవ్‌మెంట్స్ అందుకొని ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. జైసేన, కళాపోషకులు, ఐపిఎల్, అల్లంతదూరన అనే సినిమాలు చేసి ఆడియన్స్ మెప్పు పొందిన హీరో విశ్వ కార్తికేయ.. ప్రస్తుతం రామా క్రియేషన్స్ మరియు నాని మూవీ వర్క్స్  ప్రొడక్షన్ నెంబర్ 1తో పాటు పాన్ ఇండియన్ సినిమా ఎన్త్ హవర్ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అడ్వెంచర్ గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.