శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (16:35 IST)

కాన్సెప్ట్‌ + కమర్షియల్ అంశాలే సర్కిల్ - వెంకటేష్ తో వివేకానంద చేద్దామనుకున్నాం : డైరెక్టర్ నీలకంఠ

Director Neelakantha
Director Neelakantha
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా "సర్కిల్". సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా, రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా  ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త  థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు నీలకంఠ పలు విషయాలు తెలిపారు. 
 
"మాయ సినిమా తరువాత తొమ్మిదేళ్ల గ్యాప్ అనంతరం తెలుగులో సినిమా తీస్తున్నా.. తెలుగులో మళ్లీ సినిమా తీయడం చాలా సంతోషంగా ఉంది. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం. ఫేట్ (విధి) అనే కాన్సెప్ట్ ఓ వందమందిని  ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి.. ఎట్లా వారి జీవితాలను అల్లకల్లోలం చేసిందని మెయిన్ థీమ్‌గా తీసుకున్నాం. ఇది రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ కాదు. ఇన్వెస్టిగేషనల్ టైప్‌లో కాకుండా.. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రన్ చేశాం.
 
సాయి రోనక్ ఫొటో గ్రాఫర్‌గా కనిపిస్తాడు. అన్‌హ్యూమన్ సర్కిల్‌లోకి అతన్ని ఎలా లాగబడ్డాడు..? అక్కడి నుంచి కథ రివీల్ అవుతుంది. రొమాంటిక్ యాంగిల్ కూడా జత చేశాం. ముగ్గురు హీరోయిన్లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. నా గత సినిమాల్లో మాదిరే హీరోయిన్స్‌కు ఈ మూవీలో కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. ముగ్గురు హీరోయిన్లు మూడు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. సినిమాలో వాళ్ల లైఫ్‌ను వాళ్లే డిసైడ్ చేసుకుని ముందుకు సాగుతారు.  
 
బాబా భాస్కర్ గారి క్యారెక్టర్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆయన అందరికీ ఓ కొరియోగ్రాఫర్‌గానే తెలుసు. ఫస్ట్ టైమ్ ఓ కీలక పాత్రలో నటించాడు. తనదైన శైలిలో కామెడీని టచ్ చేస్తూనే విలన్‌గా మెప్పించాడు. ఈ పాత్రకు ఆయన కరెక్ట్‌గా సెట్ అయ్యారు. హీరోనా.. విలన్ అని చూడలేదు. బాబా భాస్కర్‌ను చూడగానే క్యారెక్టర్‌కు సెట్ అవువతాడని అనిపించింది. ఆయన కూడా డౌట్ పడ్డాడు. బాబా భాస్కర్ క్యారెక్టర్‌ను మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెట్‌గా ఉంటుంది.
 
నా సినిమాలు అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. నా మూవీస్ అన్ని క్రిటికల్‌గా రన్ అయ్యాయి. నేను స్టార్ హీరోలతో చేయాలని కాదు.. కాన్సెప్ట్‌ మీదే ఎక్కువగా వర్క్ చేశా. త్వరలో కుదిరితే స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తా. మాయ సినిమా తరువాత రెండు ప్రాజెక్ట్‌లకు సైన్ చేశా. అయితే అనుకోని కారణాలతో అవి ఆగిపోయాయి. మాయ మూవీని హిందీలో తీయాలని మహేష్ భట్ గారు అడిగారు. లాస్ట్ మినిట్‌లో అది ఆగిపోయింది.  మరో రెండు సినిమాలు దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. ఆ తరువాత ఓ మలయాళం సినిమా తీశా. అందుకే గ్యాప్ వచ్చింది.
 
నా మైండ్‌లో వచ్చిన ఆలోచనల ఆధారంగానే కథలను రూపొందిస్తా. ఒరిజనల్‌గా చేయడమే నాకిష్టం. సర్కిల్ సినిమా రియల్‌ లైఫ్‌కు సంబంధించిన కథ కాదు. ఊహించిన రాసిన కథే ఇది. ఫేట్ ఎలా గేమ్ ఆడిందని ఓ ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించాం. ముగ్గురు హీరోయిన్లతో లవ్ ట్రాక్ కంటే.. లైఫ్ ట్రాక్ తెరపై చూపించాం. మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు లైఫ్‌లో ఎలా ట్రావెల్ చేశాయని చూపించాం.
 
వెంకటేష్ గారితో స్వామి వివేకానంద సిరీస్‌ ప్లాన్ చేశాం. అయితే అది టేకాఫ్ కాలేదు. ఆ తరువాత వెంకటేష్‌ గారితో ఈనాడుకు కలిసి పనిచేశా. వివేకానంద సిరీస్‌ చేయాలని వెంకటేష్ గారు చాలా ఆసక్తిగా ఉండేవారు. అప్పుడ టీవీ సిరీస్‌కు తీయాలని ప్లాన్ చేశాం. కానీ ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. నాకు అవార్డు గురించి ఆలోచన లేదు. సినిమా మంచి సక్సెస్ అయి.. ఆడియన్స్ మెచ్చుకుంటే అదే నాకు పెద్ద అవార్డు. మనం సినిమా తీసి థియేటర్‌కు వెళితే.. అక్కడ జనాలు ఇచ్చే అభినందలు చెప్పలేని ఆనందాన్ని ఇస్తాయి.
 
ఈ సినిమాలో కాన్సెప్ట్‌తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా చూపించాం. ఆడియన్స్ చూసే విధానంలో మార్పు వచ్చింది. కొత్తగా తీసిన సినిమాలను తప్పకుండా ఆదరిస్తున్నారు. మా సినిమాను కూడా కచ్చితంగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం ఉంది. ఈ సినిమా తరువాత వెబ్‌సిరీస్ చేయాలని ఆసక్తి ఉంది. రెండు కాన్సెప్ట్‌లు రెడీగా ఉన్నాయి.