గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (09:02 IST)

నేడు తేలనున్న అవినాష్ రెడ్డి భవితవ్యం... బెయిల్ రద్దుపై విచారణ

YS Avinash Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు అయి, ముందస్తు బెయిలుపై విడుదలైనవున్న కడప వైకాపా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారమ జరుపనుంది. 
 
ఈ కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం.సురేంద్రన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించనుంది. 
 
ఈ కేసులో సునీత స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై ఈ నెల 13వ తేదీన వాదించారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తును ఈనెల 30 లోపు ముగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. అయితే, అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
జూన్ 9న నర్రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా అత్యవసర జాబితాలో చేర్చాలని కోర్టును అభ్యర్థించడంతో సునీత పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇపుడు ఈ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.