శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (12:52 IST)

ప్రయాణంలో జరిగిన దొంగతనానికి రైల్వే శాఖ బాధ్యత వహించదు..

supreme court
ప్రయాణంలో జరిగిన దొంగతనానికి సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పు నిచ్చింది. ప్రయాణంలో జరిగిన చోరీకి రైల్వే శాఖ బాధ్యత వహించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రయాణికుడు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
ప్రయాణంలో జరిగే చోరీ రైల్వే సేవల లోపం కిందికి రాదని పేర్కొన్న ధర్మాసనం.. అంతకుముందు వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది.
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేందర్ భోళా అనే వ్యాపారి 2005లో కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్తుండగా లక్ష రూపాయలు పోగట్టుకున్నారు. దీనిపై ఆయన ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 
 
రైలులో చోరీ జరిగింది కాబట్టి ఆ మొత్తాన్ని రైల్వే నుంచి ఇప్పించాలని కోరుతూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. అక్కడాయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.