బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (20:05 IST)

విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా ప్రారంభమైన చిత్రం

Clap by KS Ramarao
Clap by KS Ramarao
స్త్రీ తల్లి అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ చిత్ర కథాంశం. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 
 
*గెస్ట్ గా వచ్చిన సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ చైర్మన్ శ్రీ కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ..* దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఇప్పటివరకు ఎన్నో సినిమా కథలకు గోస్ట్ రైటర్ గా వర్క్ చేసి ఎంతో అనుభవం సంపాదించిన తరువాత ఒక మంచి బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్న కథను రాసుకొని నిర్మాతలను అప్రోచ్ అవ్వడం జరిగింది. తను చెప్పిన స్క్రిప్ట్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. నిర్మాతలకు ఇది మొదటి సినిమా అయినా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో  తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమా యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
 *నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..* న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ మంచి సెంటిమెంట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకులు మెచ్చే మంచి సినిమా చేస్తున్న దర్శక, నిర్మాతలకు ఆల్ ద బెస్ట్ అన్నారు.
 
*నటుడు, నిర్మాత డి ఎస్ రావు మాట్లాడుతూ..* ఈ మధ్య న్యూ టాలెంట్ తో వస్తున్న వారే ఎక్కువ హిట్ లు కొడుతున్నారు. మళ్ళీ  ఇప్పుడు కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న ఈ సినిమాను అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగితే ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇప్పటివరకు విశ్వ కార్తికేయ హీరోగా చాలా సినిమాలు చేసినా తన టాలెంట్ కి తగ్గ గుర్తింపు రాలేదనుకుంటున్నాను. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
 
*చిత్ర నిర్మాతలు డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి  మాట్లాడుతూ..*  ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న మాకు దర్శకుడు రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో కొత్త టాలెంట్ ని బయటికి తీసుకురావాలనే కాన్సెప్టుతో సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. తను కథ చెప్పిన విధానం మాకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మాలాగే సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒక్క నిమిషం సినిమా మిస్ అయినా సినిమా అర్థం కాదు. దాంతో మళ్లీ చూడాలనిపించేలా ఈ కథ చాలా బాగుంటుంది. జులై మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం జరుపుకొని సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మంచి కంటెంట్ తో వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
 
మరో నిర్మాత కాటం రమేష్ మాట్లాడుతూ..* రమాకాంత్ రెడ్డి ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎలాగైనా ఈ  సినిమా చేయాలని డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ ఆతరువాత అందరం కలిసి ఒక యూనిట్ గా ఏర్పడి ఈ సినిమా స్టార్ట్ చేశాము. ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీస్తున్న మాకు మీ  అందరి బ్లెస్సింగ్స్  కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు
 
*చిత్ర దర్శకులు రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ..*  నేను రాసుకున్న ఈ కథను తీసే నిర్మాతల కొరకు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న క్రమంలో నిర్మాతలు డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి,గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ గార్లు కలవడం జరిగింది. వారు ఈ స్టోరీ విన్న తరువాత వెంటనే ఈ సినిమా చేద్దామని నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. హీరో, హీరోయిన్స్ కూడా కథకు తగ్గట్టు బాగా సెట్టయ్యారు. ఫుల్ థ్రిల్లర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు.