శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (15:24 IST)

బ్యాంకాంక్‌లో పూజలు చేసిన త్రిష.. అందుకే సామి-2తో పాటు ఆఫర్లే ఆఫర్లు..

త్రిషకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుస పరాజయాలు రావడంతో పెళ్లి చేసుకోవాలని అప్పట్లో అనుకుంది. కానీ పెళ్ళి కూడా బౌన్స్ కావడంతో.. తిరిగి నటనపై పూర్తిగా దృష్టి పెట్టేసింది. ప

త్రిషకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుస పరాజయాలు రావడంతో పెళ్లి చేసుకోవాలని అప్పట్లో అనుకుంది. కానీ పెళ్ళి కూడా బౌన్స్ కావడంతో.. తిరిగి నటనపై పూర్తిగా దృష్టి పెట్టేసింది. ప్రస్తుతం అమ్మడుకు హారర్ జానర్‌కే పరిమితం కానుంది. పాత్ర ఎంపికలో కొత్తదనం లేకపోవడంతో మళ్లీ కెరీర్‌లో కాస్త స్తబ్ధత నెలకొంది. కానీ ఈసారి దేవుడే దిక్కంటోంది. తాజాగా దేవుని అనుగ్రహంతో తనకు భారీ ఆఫర్లు వస్తున్నాయని ఉబ్బితబ్బివవుతోంది. 
 
ఇటీవలే బ్యాంకాక్‌కు వెళ్లిన త్రిష… బ్యూటీపార్లర్‌లో పనిచేసే ఓ మహిళ ద్వారా దగ్గరలోని ఓ మహిమాన్వితమైన గుడి గురించి తెలుసుకుందట. వెంటనే అక్కడికి వెళ్లి పూజలు చేసిందట. ఆ తరువాత అమ్మడికి వరసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. విక్రమ్ సినిమా సామి-2లోనూ త్రిష హీరోయిన్‌గా ఎంపికైంది. ఇదంతా బ్యాంకాక్ దేవుడి మహిమేనని త్రిష భావిస్తోంది. 
 
గత రెండేళ్ల పాటు డల్‌గా సాగిన త్రిష  కెరీర్.. ప్రస్తుతం ఊపందుకుంది. మోహిని, చదురంగవేట్టై-2, 96, గర్జనై, 1818, సామి-2 చిత్రాలతో పాటు హే జూడ్ అనే మలయాళ చిత్రంలోను నటిస్తోంది. వీటన్నింటిలో సామి-2 మినహా మిగతా చిత్రాలన్నీ దాదాపుగా హీరోయిన్ ప్రాధాన్య చిత్రాలే. ఈ సినిమాలైనా అమ్మడుకు మంచి హిట్‌ను సంపాదించిపెట్టాలని ఆశిద్దాం..