శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 26 మే 2018 (13:56 IST)

ఎన్టీఆర్ మూవీలో కాజల్ ఐటమ్‌సాంగ్...

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ చేయనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ చేయనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కథానాయకిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఎన్టీఆర్ న్యూలుక్ అతను చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అందరూ అంటున్నారు. 
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో గల కొంపల్లి పరిసరప్రాంతాల్లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో యూత్‌ను మాస్ ఆడియన్స్‌ను ఒక ఊపు ఊపేసే ఐటమ్‌సాంగ్ ఒకటి ఉందట, ఆ సాంగ్‌ను కాజల్‌తో చేయించనున్నట్లు సమాచారం. 
 
గతంలో జనతా గ్యారేజ్‌లో కాజల్ చేసిన ఐటమ్‌సాంగ్ ఏ స్థాయిలో అదరగొట్టేసిందో అందరికి తెలిసిన విషయమే, అంతకి మించి ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు. దసరాకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.