శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 30 జూన్ 2017 (18:18 IST)

సల్మాన్ ఖాన్ 'ట్యూబ్ లైట్' ఫట్... కానీ రికార్డు సృష్టించింది... ఎట్లాగబ్బా?

బాలీవుడ్ తమాషా మూవీగా సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ గురించి చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్లో ఫట్ మన్న చిత్రంగా చెప్పుకుంటున్నప్పటికీ ఓ రికార్డును మాత్రం సొంతం చేసుకుంది. ఈ రికార్డు చెప్పుకుని ఇప్పుడు బాలీవుడ్ నవ్వుకుంటుంది. ఇంతకీ ఆ రికార్

బాలీవుడ్ తమాషా మూవీగా సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ గురించి చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్లో ఫట్ మన్న చిత్రంగా చెప్పుకుంటున్నప్పటికీ ఓ రికార్డును మాత్రం సొంతం చేసుకుంది. ఈ రికార్డు చెప్పుకుని ఇప్పుడు బాలీవుడ్ నవ్వుకుంటుంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటయా అంటే... వారం రోజుల్లో ట్యూబ్ లైట్ కలెక్షన్లు రూ.100 కోట్లకు చేరుకోవడమేనట. 
 
100 కోట్లు చేరుకున్న చిత్రాల జాబితాలో సల్మాన్ ఖాన్ చిత్రాల లిస్టు ఇప్పటివరకూ 10 వుండగా అమీర్, షారుక్ ఖాతాల్లో ఏడేసి వున్నాయి. కాబట్టి ఆ రకంగా ట్యూబ్ లైట్ కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించిందని చెప్పుకుంటున్నారు. 
 
ఇంతకీ ఈ చెత్త సినిమాను ఎవరు చూస్తున్నారబ్బా అనుకుంటున్నారా... ఇంకెవరూ... సల్మాన్ ఖాన్ అభిమానులేనట. సల్మాన్ ఖాన్ ఎక్కడ ఫీలయిపోతాడోనని ఆయన ఫ్యాన్స్ ఒకటికి నాలుగుసార్లు ట్యూబులైట్లలా మారిపోయి చిత్రాన్ని తెగ చూస్తున్నారట. అలా చూడటంతో కలెక్షన్లు వచ్చాయని అంటున్నారు.