గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (13:56 IST)

స్నేహితురాలు ఇంట్లో పూజ.. హైదరాబాదులో అదృశ్యమైన నటి

woman
టీవీ సీరియల్ నటి హైదరాబాదులో అదృశ్యమైంది. స్నేహితురాలు ఇంట్లో పూజకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంతోషి, నీలకంఠ దంపతులకు కుమార్తె, కుమారుడు వున్నారు. 
 
కుమార్తె 8వ తరగతి వరకు చదివి బడి మూసేసింది. ఇంట్లో వుండే ఆమె సీరియల్స్ షూటింగ్‌కు వెళ్లి వస్తుండేది. అయితే ఈ నెల 12 స్నేహితురాలింట్లో పూజ కోసం వెళ్లింది. ఆ రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో సంతోషి కుమార్తెకు ఫోన్ చేయగా తాను యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ వద్ద వున్నానని చెప్పింది. 
 
ఇంటికి వస్తున్నానని తెలిపింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా నెంబర్ కలవలేదు. రాత్రంతా ఎదురుచూసినా ఇంటికి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.