గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (17:23 IST)

రొమాంటిక్ చిత్రానికి U/A సర్టిఫికెట్‌- త్వ‌ర‌లో థియేట‌ర్స్‌లో

Akash Puri, Ketika Sharma
పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి న‌టించిన‌ చిత్రం `రొమాంటిక్`. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూరీ అందించారు. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌లపై  పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా సెన్సార్ఈ  చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో కేతికా శర్మను ఆకాష్ వెన‌క నుండి కౌగిలించుకోవడం చూడొచ్చు. ఇది సినిమా టైటిల్‌ను జ‌స్టిఫై చేస్తుంది. త్వ‌ర‌లో థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నారు మేక‌ర్స్‌. 
 
రమ్య‌కృష్ట ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఇంటెన్స్ రొమింటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునిల్ కశ్య‌ప్ సంగీతం అందించారు. న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలకు విశేష‌ స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజైన అన్ని పోస్టర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమాపై  మంచి బ‌జ్‌ని క్రియేట్ చేశాయి. ఇంకా మ‌క‌రంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్‌, సునైన న‌టించారు.