ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (09:10 IST)

హను-మాన్ టీమ్ ని అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Prashant Varma, Teja Sajja, Kishan Reddy
Prashant Varma, Teja Sajja, Kishan Reddy
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్‌'. హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇటివలే విడుదలైన  'హను-మాన్' టీజర్ సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా 'హను-మాన్' టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ 36 మిలియన్+ వ్యూస్ క్రాస్ క్రాస్ చేసి,  పాన్ ఇండియా ప్రశంసలు అందుకుంటూ, యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా హను మాన్ చిత్ర బృందాన్ని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. హను మాన్ టీజర్ అద్భుతంగా వుందని కితాబిచ్చారు.  
 
అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  
 
టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
 
హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.
 
తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు