సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (22:53 IST)

పీడించింది చాలు.. ఇకనైనా వదిలి వెళ్లిపో.. వడివేలు పాట

vadivelu
కరోనాపై పోరాటానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కరోనా నుంచి తప్పించుకోవాలంటే.. ప్రజలు ఎవరి ఇళ్లలోనే వారు ఉండాలని సెలెబ్రిటీలు సూచిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలను పోస్టు చేస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు కరోనాపై పాటలు పోస్టు చేశారు. తాజాగా ఈ జాబితాలో తమిళ నటుడు వడివేలు కూడా చేరారు. 
 
ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలను సమర్దించాలని ఓ పాటను వినిపించారు. కరోనా' కట్టడికి కళాకారులు తమ వంతు విరాళం ఇవ్వడమో లేకపోతే వివిధ కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమో చేస్తున్నారు. 'కరోనా' వ్యాప్తి చెందకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పటికే చాలాసార్లు సూచించిన వడివేలు.. ప్రపంచాన్ని పీడిస్తున్న 'కరోనా' ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటూ పాటపాడారు. 
 
ప్రపంచాన్ని ఇప్పటి వరకు పీడించింది చాలని, ఇకనైనా వదిలి వెళ్లిపోవాలంటూ 'కరోనా' ను తన పాట ద్వారా ఆయన కోరారు. ఈ తమిళ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.