ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 3 ఆగస్టు 2017 (20:50 IST)

'ఫిదా' పల్లవి కన్నా నాకే ఎక్కువ గుర్తింపునిచ్చింది... వరుణ్‌ తేజ్(వీడియో)

ఫిదా సినిమాతో లవర్ బాయ్‌గా తానేంటో నిరూపించుకోగలిగానన్నారు నటుడు వరుణ్‌ తేజ్. మాసయినా, క్లాసయినా ఏ క్యారెక్టరయినా తాను చేయగలనని చెప్పారు. ఫిదా సినిమాతో తనను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన దర్శకుడు శేఖర్ కమ్ములను జీవితంలో మరిచిపోలేనన్నారు వరుణ్

ఫిదా సినిమాతో లవర్ బాయ్‌గా తానేంటో నిరూపించుకోగలిగానన్నారు నటుడు వరుణ్‌ తేజ్. మాసయినా, క్లాసయినా ఏ క్యారెక్టరయినా తాను చేయగలనని చెప్పారు. ఫిదా సినిమాతో తనను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన దర్శకుడు శేఖర్ కమ్ములను జీవితంలో మరిచిపోలేనన్నారు వరుణ్‌. 
 
సినిమాలో సాయిపల్లవి క్యారెక్టర్ బాగుంటుంది కాబట్టే ఆమెకు ఎక్కువ మార్కులు వచ్చాయనీ, అంతేతప్ప ఇందులో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న భావన ఎవరిలోను లేదన్నారు వరుణ్‌ తేజ్. అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లనే సినిమా సక్సెస్ దిశగా దూసుకెళ్ళిందని తిరుపతిలో మీడియాకు తెలిపారు వరుణ్‌.