బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (17:44 IST)

పన్నుఎగ్గొట్టిన మాట నిజమే... కోర్టులో అమలాపాల్

విదేశీ కారును దిగుమతి చేసుకుని పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ అమలాపాల్. ఈమె ఓ ఫారిన్ కారును పుదుచ్చేరికి చెందిన ఓ విద్యార్థి పేరుతో కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ.20 లక్షల మేరకు పన్

విదేశీ కారును దిగుమతి చేసుకుని పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ అమలాపాల్. ఈమె ఓ ఫారిన్ కారును పుదుచ్చేరికి చెందిన ఓ విద్యార్థి పేరుతో కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ.20 లక్షల మేరకు పన్ను ఎగవేసినట్టు సమాచారం. 
 
దీనికి సంబంధించి ఆమెపై కేరళలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. నిజానికి ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారం సాగింది. దీంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా దాన్ని కోర్టు తిరస్కరించింది. 
 
అదేసమయంలో క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె లొంగిపోయింది. తాను ఎటువంటి తప్పు చేయలేదని గతంలో చెప్పుకున్న ఆమె.. ఇప్పుడు తప్పును అంగీకరించినట్లు సమాచారం. ఆమె మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.