సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 24 మే 2018 (12:40 IST)

నాని హీరోగా, అమలాపాల్ హీరోయిన్‌గా.. కోలీవుడ్ సినిమా?

నాని ప్రస్తుతం కోలీవుడ్‌పై కన్నేశాడు. అక్కడ రెండు మూడు సినిమాలు చేసి యంగ్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన నాని.. తాజాగా తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే.. తమిళ సినిమాలో నటించేందుకు సై అన్నాడు. ఇప్పటికే

నాని ప్రస్తుతం కోలీవుడ్‌పై కన్నేశాడు. అక్కడ రెండు మూడు సినిమాలు చేసి యంగ్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన నాని.. తాజాగా తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే.. తమిళ సినిమాలో నటించేందుకు సై అన్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్-2 తెలుగుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాని.. తాజాగా తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో ''వేలన్ ఎట్టుత్తిక్కుమ్'' అనే సినిమాలో నటిస్తున్నాడు. 
 
ఇందులో నాని హీరోగా, కథానాయికగా అమలా పాల్ నటిస్తోంది. అవినీతి, అక్రమాలపై పోరాడే ఒక యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు. సామాజిక సందేశంతో కూడిన యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
 
జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. అంతేగాకుండా ఈ సినిమా ద్వారా నానికి కోలీవుడ్‌లో క్రేజ్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని, అమలాపాల్, శరత్ కుమార్, రాగిణి ద్వివేది, వెన్నెల కిషోర్, శివబాలాజీ తదితరులు నటిస్తున్నారు.