మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 25 ఏప్రియల్ 2019 (21:33 IST)

ఆ విషయంలో వెనక్కి తగ్గిన విజయ్ దేవరకొండ

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అనే పదం ఇప్పటికే వినుంటారు. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్‌కు బాగా సూటయ్యింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ డైలాగ్‌నే కొంతమంది ఫాలో అవుతున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకరు. వరుసగా హిట్లు వస్తున్నా.. అమాంతం తన క్రేజ్ పెరిగిపోతున్నా విజయ్ దేవరకొండ మాత్రం ఎక్కడా గర్వం చూపించడం లేదన్నది తెలుగు సినీపరిశ్రమలో జరుగుతున్న చర్చ.
 
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ యువ నటుల్లో అగ్రస్థానానికి వెళ్ళిపోయారు. తాజాగా ఆయన రష్మిక మందనతో కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. నాలుగు భాషల్లో సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తేదీని మాత్రం పూర్తిగా మార్చే ఆలోచనలో పడిపోయారు విజయ్ దేవరకొండ. ఇప్పటికే మే 31వ తేదీ సినిమాను విడుదల చేయాలని మొదటగా భావించారు.
 
కానీ వరుసగా ఈ నెల సినిమాలు విడుదలవుతుండటం, అందులోను తమిళంలో సూర్య సినిమా, తెలుగులో వచ్చే నెల 9వ తేదీ మహర్షి సినిమాలు విడుదలవుతుండటంతో విజయ్ దేవరకొండ వెనక్కి తగ్గారు. స్టార్ హీరో సినిమాలకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేయకూడదని నిర్మాతకు సూచించారట. దీంతో జూన్ నెలలో సినిమాను పోస్ట్‌పోన్ చేసుకున్నారు. జూన్ 23వ తేదీన డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. రష్మిక, విజయ్ దేవరకొండ ముద్దుల సీన్ టీజర్లో ఉండటంతోసినిమా కోసం ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.