ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (12:00 IST)

విజయ్ దేవరకొండకి గట్టి పోటీ ఇస్తోన్న సూర్య

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస విజయాలు సాధించిన విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' సినిమా రూపొందిన విషయం తెలిసిందే. కాగా... రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమాను మే 31వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ సినిమాను అదే రోజున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. 
 
దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం... 'డియర్ కామ్రేడ్'కి కలిసొచ్చే అంశమని అంతా అనుకున్నారు. అయితే అనుకోకుండా 'ఎన్జీకే' వచ్చి ఇదే తేదీని ఫిక్స్ చేసుకుందట. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో పూర్తయినప్పటికీ... కారణాంతరాల వలన వాయిదా పడుతూ వచ్చి, ఇదే తేదీని ఖరారు చేసుకుందట. తమిళనాట సూర్యకి గల క్రేజ్ గురించి తెలిసిందే. 
 
అందువలన విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్'కి ఈ సినిమా గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ పోటీని తట్టుకొని విజయ్ దేవరకొండ ఎలా ముందుకు పోతాడో వేచి చూడాల్సిందే మరి.