శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (12:47 IST)

''సూర్యకాంతం'' ఫంక్షన్‌లో శ్యామల ఓవరాక్షన్.. తెల్లమొహం వేసిన శివాజీరాజా

''సూర్యకాంతం'' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో యాంకర్ శ్యామల ఓవరాక్షన్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్యామల అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇంకా అతి చేయడంతో ప్రేక్షకులు షాకయ్యారు. 
 
ఇటీవల జరిగిన ''మా'' ఎన్నికల్లో ఓటమి పాలైన శివాజీ రాజా అయితే తెల్లమొహం వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టైటిల్ కాన్సెప్ట్‌లో భాగంగా ‘మీ జీవితంలో మీరు చూసిన సూర్యకాంతం ఎవరు’? అంటూ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులను శ్యామల ప్రశ్నిస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది.  
 
అలా అందరినీ అడుగుతూ శివాజీ రాజా వద్దకు వచ్చిన శ్యామల.. మా ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు కంగ్రాట్స్ అంటూ మొదలుపెట్టింది. ఆమె వ్యాఖ్యలతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. అంతేకాదు.. ''మీరు గెలిచిన తర్వాత ఇదే మొదటి ఫంక్షన్ అనుకుంటా'' అనడంతో శివాజీ రాజాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.
 
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించిన శివాజీ రాజా.. ''గెలిచింది నేను కాదు తల్లీ.. నేను ఓడిపోయా. నా టీంలో మాత్రం కొందరు గెలిచారు'' అని ఇబ్బంది పడుతూ చెప్పారు. అయినా.. మీ టీమ్‌లో వారు గెలిస్తే మీరు గెలిచినట్టే కదా అంటూ కవర్ చేసింది. కాగా మా ఎన్నికల్లో ఓడినా శివాజీ రాజాకి కంగ్రాట్స్ చెప్పడమే కాకుండా.. మీరు గెలిచినట్టే.. అంటూ శ్యామల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. టీమ్ గెలిచినా మీరుండి గెలిపించినట్టే కదా అంటూ శ్యామల చేసిన వ్యాఖ్యలపై జోకులు పేలుతున్నాయి.