శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 మే 2021 (22:54 IST)

అకీరా నందన్‌ సినీ ఎంట్రీకి రంగం సిద్ధం.. తొలి సినిమా అదేనా..? ఫోటో వైరల్!

Akira Nandan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపించినా కూడా రచ్చ చేస్తుంటారు పవన్ ఫ్యాన్స్. మొన్న ఏప్రిల్ 8న అకీరా బర్త్ డే రోజు అయితే ఏకంగా నేషనల్ వైడ్ ట్రెండ్ చేసారు అభిమానులు. ఇదే సమయంలో ఈయన ఎంట్రీపై కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. పవన్ సినిమాలు చేస్తున్నా.. రాజకీయాల్లో వుండటం వల్ల సినిమాలకు దూరమవుతాడనే బాధ అభిమానుల్లో వుంది. 
 
మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్ సినిమాలు రావడం లేదనే బాధ వాళ్లలో కనిపిస్తుంది. ఐతే ప్రస్తుతం సినిమాలతో బిజీగా పవన్ వుండటంతో పాటు ఆయన కుమారుడు అకీరాను కూడా సినిమాల్లోకి దించాలనే ఉద్దేశంతో వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 6.4 హైట్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు జూనియర్ పవర్ స్టార్. తాజాగా బయటికి వచ్చిన అకీరా ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను కూడా మించిపోయాడు అకీరా. 
 
వరుణ్ తేజ్ హైట్ కూడా అకీరా ముందు పనికొచ్చేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఈయన తొలి సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అకిరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. రేణు దేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకీరా నటించాడు. 
 
దీన్ని తెలుగులో అనువదించాలని చూస్తున్నారు. దాంతో పాటు పవన్ వారసున్ని నేరుగానే ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మరికొన్ని రోజుల్లోనే దీనిపై వివరాలు బయటికి రానున్నాయి.