పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?
కోలీవుడ్ హీరో విశాల్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి ధన్సికను విశాల్‌ను వివాహం చేసుకోనున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్షికల మధ్య ప్రేమ కొనసాగుతుందని, వీరిద్దరి బంధానికి ఇరు కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం కూడా లభించినట్టు సమాచారం.
దీంతో వీరిద్దరూ త్వరలోనే వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని తమిళ మీడియాలో జోరుగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రచారంపై అటు విశాల్ కానీ, ఇటు సాయి ధన్సిక కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. స్పందించనూ లేదు.
కాగా, ఇటీవల విశాల్ మాట్లడుతూ, నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయితే తాను వివాహం చేసుకుంటానని ప్రకటించిన విషయం తెల్సిందే. ఆయన చెప్పినట్టుగానే నడిగర్ సంఘం భవన నిర్మాణం ఆగస్టులో పూర్తికానుంది. ఆ తర్వాత ఆయన పెళ్లి పీటలెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే, సాయి ధన్సిక విషయానికి వస్తే, పలు తమిళ చిత్రాల్లో నటించిన ఈ యువతి... తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో షికారు, అంతిమ తీర్పు, దక్షిణ అనే చిత్రాల్లో నటించారు.