శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (15:06 IST)

ఆ టైం కోసం ఎదురు చూస్తున్నా: అమితాబ్ తో చిరంజీవి

Amitab-chiru
Amitab-chiru
అమితాబ్  బచ్చన్, చిరంజీవి కి ఉన్న స్నేహం తెలిసిందే. ఇద్దరు సూపర్ స్టార్స్. ఈరోజు అమితాబ్ 81వ పుట్టినరోజు సంధర్భంగా చిరు శుభాకాంక్షలు తెలిపేరు. ఇద్దరు కలిసి సైరా నరసింహా రెడ్డి లో నటించారు. ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్ పతి షో అమితాబ్ చేస్తున్నారు. ఈ షో తనకెంత ఇస్తామని తెలిపుటు ట్వీట్ చేసాడు. 
 
మీరు సంతోషం, మంచి ఆరోగ్యంతో నిండిన దీర్ఘాయువుతో ఉండాలి. మీ నటనా ప్రతిభాపాటవాలతో, అనేక సంవత్సరాల పాటు మీరు లక్షలాది మందిని ఆకట్టుకుని, స్ఫూర్తినిస్తూ ఉండండి.  ఈ మీ పుట్టినరోజు కూడా నాకు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే మీ కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఈ రాత్రి వర్చువల్‌గా నా ఆరాధ్యదైవమైన మిమ్మల్ని కలవాలని నేను ఎదురు చూస్తున్నాను అన్నారు.