శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (21:19 IST)

భారత్ లో ఈ ఘనత తెలుగు జర్నలిస్టులకే దక్కింది : మెగాస్టార్‌ చిరంజీవి

Megastar Chiranjeevi, vinayakrao, prabhu, ravi
Megastar Chiranjeevi, vinayakrao, prabhu, ravi
మెగాస్టార్‌ చిరంజీవి ఈరోజు తన స్వగృహం లో ఆత్మేయకరంగా కలిసి తెలుగు సినీపాత్రికేయ చరిత్ర పుస్తకం ఆవిష్కరించారు. తెలుగు సినీజర్నలిస్టులు చెన్నై, హైదరాబాద్‌లో పనిచేసిన వారి గురించి సీనియర్‌ జర్నలిస్టు యూ. వినాయకరావు రాసిన ఈ పుస్తకాన్ని ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, జర్నలిజం చాలా మంచి వాతావరణంతో వుంది.

చెన్నైలో ఓ షూటింగ్‌లో వుండగా, షూటింగ్‌ స్పాట్‌కు ఓ జర్నలిస్టును సెక్యూరిటీ రానీయవ్వలేదని అలిగి, ఆ తర్వాత నా సినిమా గురించి ఏ పత్రికలోనూ రానీయకుండా చేశారని గుర్తు చేసుకున్నారు. అసలు ఏం జరిగింది? అనేవి నాకు తెలీదు. ఆ తర్వాత పూర్తి వివరాలు తెలుసుకుని అల్లు అరవింద్‌ గారు కూడా దానిపై విశ్లేషించి సరిచేశారు. జర్నలిజం అనేది నిక్కచ్చిగా ఉండేది.
 
మరో జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారు కూడా ఓ సందర్భంలో అలిగారు. అదికూడా పక్కన ఉన్నవారు చెప్పిన మాటలు అపార్ధం చేసుకున్నారు. అది తెలియక నేను వాళ్ళ ఇంటికి వెల్లాను. ఆయన ఆశ్చర్య పోయారు. ఇలా అందరితో మంచి అనుబంధం ఉంది. 
ఇలా ఎన్నో అనుభూతులు నాకు జర్నలిస్టులపై వున్నాయి. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా వుందని పేర్కొన్నారు.
 
వినాయకరావు కి ప్రశంసలు 
ఇలాంటి అవకాశం ఎవరికీ రాదు. జర్నలిస్టుల గురించి రాయాలనే ఆలోచన వినాయకరావు కి రావడమే మంచి పరిణామమే. పుస్తకం రాయడానికి  4 ఏళ్ళు పట్టింది. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. చాలా పుస్తకాలు రాశారు. ఇకపై కూడా రాయాలి. రెటైమెంట్ ఇవ్వవద్దు. మీరు రాసిన ఈ పుస్తకం భావి తరాలకు స్ఫూర్తి నిస్తుంది. తరతరాలకు  తెలియాలి. భారతదేశంలోనే ఇలా జర్నలిస్టుపై పుస్తకం రావడం మొదటిది.  ఆ ఘనత తెలుగువారికి దక్కడం అభినందనీయమని చిరంజీవి అన్నారు.
 
ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని జర్నలిస్టు అభిమాని పనస రవి తొలి ప్రతిని 50వేల రూపాయలు కొనగా, ఆయన చేయి పైనే వుండాలని మెగాస్టార్‌ చిరంజీవి మలి ప్రతిని ఒక్క రూపాయి తక్కువగా కొని ఆ చెక్‌ను రచయిత వినాయకరావుకు అందజేశారు.