ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (17:12 IST)

సల్మాన్ ఖాన్‌ను హ‌రీష్ శంక‌ర్ క‌ల‌వ‌డంలో ఆంత‌ర్యం అదేనా!

Salman Khan, Harish Shankar,
Salman Khan, Harish Shankar,
ఇప్పుడు తెలుగులో పాన్ ఇండియా సినిమాలుగా అన్నీ మారిపోయాయి. ఇత‌ర హీరోల‌తో కాంబినేష‌న్‌లతో  క‌థ‌లు ముందుకు వ‌స్తున్నాయి. తాజాగా చిరంజీవి త‌ను చేస్తున్న గాడ్‌ఫాద‌ర్ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌కుడు. అయితే ఈ సినిమాకు కొంత క‌థాప‌రంగా హ‌రీష్ కూడా వ‌ర్క్ చేస్తున్న‌ట్లు వినికిడి. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు హరీష్ శంక‌ర్‌తో అ్ర‌గ నిర్మాణ సంస్థ సినిమా చేయ‌బోతోంది.
 
ఇందుకు నిజం చేస్తూ, కొద్ది రోజుల క్రితం, దర్శకుడు హరీష్ శంకర్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో క‌లిసి పోజులిచ్చాడు ఈ చిత్రం వైరల్‌గా మారింది, ఇది కొత్త ఊహాగానాలకు దారితీసింది. ఇప్పుడు హరీష్ సల్మాన్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడని అందుకే హరీష్ స్టార్ హీరోని కలిశాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న గాసిప్. ఈ ప్రాజెక్ట్ వెనుక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఉందని తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో గ‌బ్బ‌ర్ సింగ్ తీసిన హ‌రీష్ శంక‌ర్ ఇప్పుడు తానుకూడా పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు అవ్వాల‌నే కోరిక‌ను వ్య‌క్తం చేస్తున్నాడ‌ట‌. అందుకే భారీ క‌థ‌తో ముందు\కు రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో వివ‌రాలు తెలియ‌నున్నాయి.