శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (18:39 IST)

శ్రీవారిని దర్శించుకున్న రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులు(Video)

బాలీవుడ్ సినీ తారలు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. నవంబర్ 14వ తేదీతో ఈ బాలీవుడ్ ప్రేమ పక్షులు దంపతులై ఏడాది అయ్యింది. వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకుని ఈ జంట శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన వీరు, రోడ్డు మార్గంలో తిరుమల చేరుకొని శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేసారు. 
గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో ఉత్తర భారతదేశానికి సంబంధించిన సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుని, అనంతరం గర్భగుడిలోని శ్రీవారి మూలవిరాట్‌ను దర్శించుకున్నారు.
 
అనంతరం హుండీలో కానుకలు చెల్లించి వివాహ మొక్కుబడి చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన దీపిక, రణ్ వీర్ లను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. 
 
ఇంకా పెళ్లినాటి వస్త్రధారణతో దీపికా, రణ్ వీర్ కనిపించడంతో అభిమానులను వారిని కళ్లార్పకుండా చూశారు. ఈ దంపతులకు వివాహం జరిగి ఏడాది కావడంతో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రణ్ వీర్, దీపికా కుటుంబీకులు వారితో పాటు శ్రీవారిని దర్శించుకున్నారు.