బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2025 (11:58 IST)

జాతస్య మరణం ధ్రువం తో సీరత్ కపూర్ సక్సెస్ తెచ్చిపెడుతుందా

Seerat Kapoor
Seerat Kapoor
పలు సినిమాలు నిర్మించి ఫెయ్యిల్యూర్ గా నిలిచిన నిర్మాత మల్కాపురం శివ కుమార్ తాజాగా జాతస్య మరణం ధ్రువం తో రాబోతున్నాడు. జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ తారాగణంతో ఆయన నిర్మించారు. త్రిష ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రవణ్ జొన్నాడ రచన, దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్‌ ఇది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాతో ప్రీతీ జంఘియానీ కూడా రీఎంట్రీ ఇస్తోంది.
 
ఈ చిత్రానికి 'జాతస్య మరణం ధ్రువం'అనే టైటిల్‌ ఖరారు చేసిన మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ని లాంచ్ చేశారు. ఒక సంస్కృత పదబంధం నుంచి వచ్చిన ఈ టైటిల్ కు "పుట్టినవారికి మరణం తప్పదు" అని అర్ధం. ఈ టైటిల్ బ్రెత్ టేకింగ్, థాట్ ప్రొవొకింగ్ నెరేటివ్ కి టోన్ సెట్ చేస్తుంది.
 
JD చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఎక్స్ ప్రెషన్స్ కనిపిస్తూ మిస్టరీ సెన్స్ ని క్రియేట్ చేసే ఫస్ట్-లుక్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.