సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (17:20 IST)

శ్రీవల్లీ రివ్యూ రిపోర్ట్: విజయేంద్రప్రసాద్.. రచయితగా సక్సెస్.. కానీ దర్శకుడిగా..?

మగధీర, బాహుబలి వంటి హిట్ సినిమాలకు కథలు రాసిన జక్కన్న తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ శ్రీవల్లీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఓ విభిన్న కాన్సెప్ట్‌తో థ్రిల్లర్ అంశాన్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించార

సినిమా పేరు: శ్రీవల్లీ
దర్శకత్వం: విజయేంద్రప్రసాద్, 
నిర్మాత : సునీత, రాజకుమార్ బృందావన్ 
నటీనటులు : నేహా హింగే, రజత్, రాజీవ్ కనకాల, హేమ తదితరులు 
రేటింగ్ : 2.5
 
మగధీర, బాహుబలి వంటి హిట్ సినిమాలకు కథలు రాసిన జక్కన్న తండ్రి,  రచయిత విజయేంద్రప్రసాద్ శ్రీవల్లీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఓ విభిన్న కాన్సెప్ట్‌తో థ్రిల్లర్ అంశాన్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శ్రీవల్లిగా నేహా నటన హైలైట్‌గా నిలిచింది. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. కానీ స్క్రీన్‌ప్లే ఆకట్టుకోలేకపోయింది. 
 
శ్రీవల్లీ అనే యువతిపై ఓ న్యూరో సర్జన్ బ్రెయిన్ ఎక్స్పరిమెంట్ చేయాలనే ప్రయత్నంలో.. ఆమె భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలోని వ్యత్యాసాన్ని మరిచిపోతుంది. ఏది నిజం, ఏది మాయ అనేది అర్థం చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటుంది. దీనివల్ల ఓ పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది. రాజీవ్ కనకాల (సినిమాలో రామచంద్ర) సైంటిస్టుగా అదరగొట్టాడు. బ్రెయిన్ ఎక్స్పరిమెంట్ చేస్తూ వున్నట్టుండి రోడ్డు ప్రమాదంలో చిక్కుకుని కోమాలోకి వెళ్ళిపోతాడు. ఈ సమస్య నుంచి ఆమె ఎలా బయటపడింది. అనేదే శ్రీవల్లీ కథ.
 
రచయిత విజయేంద్ర ప్రసాద్ రాణించగలిగారు. అయితే దర్శకత్వంలో ప్రతిభను చూపెట్టలేకపోయారు. సై-ఫి-థ్రిల్లర్‌గా శ్రీవల్లీని తెరకెక్కించడంలో ఫైర్ అయ్యారు. చిన్నబడ్జెట్‌తో విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా గ్రాఫిక్స్ పెద్దగా ఆకట్టుకోలేదు.