శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By selvi
Last Updated : బుధవారం, 12 జులై 2017 (11:55 IST)

జయ జానకీ నాయక సినిమా ట్రైలర్‌ వచ్చేసింది.. (వీడియో)

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జయ జానకీ నాయక సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో బెల్లంకొండ తరపున రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, కేథరిన్ థెరిస్సాలు హీరోయిన్ల

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జయ జానకీ నాయక సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో బెల్లంకొండ తరపున రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, కేథరిన్ థెరిస్సాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలావరకు ముగింపు దశకు రానుంది. 
 
అల్లుడు శీను సినిమాతో తెరంగేట్రం చేసిన శ్రీనివాస్ హీరోగా పర్వాలేదనిపించుకుంటున్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ దశలోనే వుంది. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సినీ యూనిట్ రిలీజ్ చేసింది. 
 
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఇందులో జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి, శ‌ర‌త్ కుమార్‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఆగ‌స్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ఎలా వుందో చూడండి..