బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (06:42 IST)

బాల‌కృష్ణ 'పైసావసూల్' దూకుడు.. ''పదామరి'' సాంగ్ రిలీజ్ (Video)

పూరీ జగన్నాథ్, బాలకృష్ణ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న ‘పైసా వ‌సూల్’ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఇటీవల విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ ట్రైల‌ర్ యూట్యూబ్‌లో దుమ్ముదులిపేస్తోంది.

పూరీ జగన్నాథ్, బాలకృష్ణ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న ‘పైసా వ‌సూల్’ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఇటీవల విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ ట్రైల‌ర్ యూట్యూబ్‌లో దుమ్ముదులిపేస్తోంది. 
 
ఈ ట్రైల‌ర్ నాలుగు గంట‌ల్లో మిలియ‌న్ వ్యూస్ సాధించింద‌ని, 15 గంట‌ల్లో రెండు మిలియ‌న్ల వ్యూస్ పొందిందని, 25 గంట‌ల్లో మూడు మిలియ‌న్ల వ్యూస్ రాబట్టిందని భ‌వ్య క్రియేష‌న్స్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది. 
 
ఈ ట్రైల‌ర్‌లో పూరీ మార్క్ సీన్లను, బాలయ్య చెబుతున్న డైలాగులను, చేస్తోన్న డ్యాన్స్ ను చూపించారు. ఈ సినిమా వ‌చ్చేనెల 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 
 
కాగా, ఈ చిత్రంలోని పాటలను ప్రోమోలుగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ''పదామరి'' అనే సాంగ్‌ను విడుదల చేయగా, ఈ ప్రోమో సాంగ్‌కు 2 మిలియన్ల మంది వీక్షించారు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు శ్రియా శరణ్, ముస్కాన్ సేథ్, కిరా దత్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.