ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (13:19 IST)

'అమ్మ'గా అదరగొట్టిన కంగనా రనౌత్ ... 'తలైవి' ట్రైలర్ అదిరిపోయింది...

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. ఈ చిత్రం ట్రైలర్‌ను కంగనా రనౌత్ పుట్టిన రోజును పురస్కరించుని మంగళవారం చెన్నైలో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయగా, ఈ ట్రైలర్ అదిరిపోయింది. 
 
ఇందులో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ అద్భుతంగా నటించింది. బాలీవుడ్‌లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు పోషించి తనకంటు ఒక సపరేట్ ఇమేజ్ అండ్ పాపులారిటీని సంపాదించుకున్న కంగనా.. తాజాగా 'తలైవి' సినిమాలో తన అత్యద్భుత నటనను ప్రదర్శించి, ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
 
లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్ రచన, దర్శకుడు విజయ్ తెరకెక్కించిన విధానం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కంగనా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ లెజెండరీ పర్సనాలిటీని మరిపించి ఇన్నాళ్ళు కొందరిలో ఉన్న అనుమానాలను పటా పంచలు చేసింది. 
 
ఇక దివంగత ఎంజి.రాచమంద్రన్ పాత్రలో అరవింద స్వామి జీవించారు. ఈ సినిమాకు ఆయన పాత్ర పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక 'తలైవి' ఏప్రిల్ 23న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చారు. తన సంగీతంతో ఈ చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాలకు ప్రాణం పోశారు.