శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (20:38 IST)

ఆపద సమయంలో తల్లిని కాపాడిన బుడ్డోడు (వీడియో)

mother-son
mother-son
సోషల్ మీడియాలో ఎన్నో వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు మాత్రం చాలా వేగంగా వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో తాజాగా విడుదలైన వీడియో కూడా ఒకటి. నిచ్చెనపైకెక్కి ఏదో పనిచేస్తున్న తల్లి.. నిచ్చెన పక్కకు తప్పుకోవడంతో మధ్యలో వేలాడుతూ వుండిపోయింది. అయితే అలా ఆపదలో వున్న తల్లిని ఓ బాలుడు కాపాడాడు. 
 
విదేశాల్లో ఓ ఇంటి ముందు పొడవాటి ఇనుప దూలంపై నిచ్చెనపై నిలబడి ఓ మహిళ పనిచేస్తుంది. అప్పుడు ఆమె నిలబడి ఉన్న నిచ్చెన కింద పడిపోయింది. అంతే ఆ మహిళ అడ్డంగా వున్న ఇనుప దూలాన్ని గట్టిగా పట్టుకుంది. 
 
అలానే వేలాడుతూ కనిపించింది. వెంటనే పక్కనే వున్న బాలుడు.. తీవ్రంగా ప్రయత్నించి.. ఆ నిచ్చెనను నిలబెట్టాడు. తన తల్లిని కాపాడేందుకు ఈ బుడ్డోడు తన సాయశక్తులా ప్రయత్నించి.. నిచ్చెనను నిలబెట్టాడు. 
 
ఎలాగోలా ఆ మహిళ కూడా కాలతో ఆ నిచ్చెనను అందుకుని.. కిందకు దిగింది. ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను చూసినవారంతా ఆ బాలుడి సమయోచిత బుద్ధి భలే అంటూ ప్రశంసిస్తున్నారు.