శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (19:03 IST)

డాన్సింగ్ అంకుల్ మళ్లీ వచ్చేసాడు.. (video)

మీకు డాన్సింగ్ అంకుల్ గుర్తున్నారా? కొన్ని రోజుల ముందు సోషియల్ మీడియాలో రచ్చ చేసాడు. ఓ పెళ్లి వేడుకలో గోవిందా స్టయిల్ డ్యాన్స్ వేసి అదరకొట్టాడు. ఆయనను ముద్దుగా డబ్బు ది డ్యాన్సర్ అని కూడా పిలుస్తారు. 
 
ఇప్పుడు గుర్తుకొచ్చాడా? ఆయన పేరు సంజీవ్ శ్రీవాత్సవ. ఆయనది మధ్యప్రదేశ్. ఆయనే మళ్లీ డ్యాన్స్ వేసి అదరగొట్టారు. అయితే ఈసారి పూర్తి భిన్నంగా డ్యాన్స్ వేసాడు. ఈసారి ఆయన వేసిన డ్యాన్స్‌కు చాలా స్పెషాలిటీస్ ఉన్నారు.
 
చాచా నాచ్ అనే పేరుతో డ్యాన్సింగ్ అంకుల్ ఈ వీడియోను రూపొందించారు. మ్యూజిక్ కంపోజర్ జాసిమ్, సింగర్ బెన్నీ దాయల్‌తో కలిసి డ్యాన్సింగ్ అంకుల్ ఈ వీడియోను రూపొందించారు. ఇది సొంత సంగీతంతో రూపొందించిన వీడియో. 
 
చాచా నాచ్ అనేది ప్రపంచంలోని అంకుల్స్ అందరూ కనిపెట్టిన తక్కువ స్థాయి ఇండియన్ డ్యాన్స్ అంటూ ఆ వీడియోకు క్యాప్సన్ కూడా ఇచ్చారు. డాన్సింగ్ అంకుల్ రీఎంట్రీ ఇచ్చాడు. డ్యాన్స్ మూమెంట్స్‌తో పిచ్చెక్కిస్తున్నాడంటూ నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్‌లు చేస్తున్నారు.