శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (14:12 IST)

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తలరాతలు మారుతాయ్ : కిరణ్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఈ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి వెంట ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఉమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నారు.
 
ఈ నెల 13న కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మీడియాలో వార్తలు వచ్చిన విషయం విదితమే. గత కొద్ది రోజుల క్రితం ఉమెన్ చాందీ.. కిరణ్‌ కుమార్‌ రెడ్డితో సమావేశమై కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
 
2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. ఆ తర్వాత వచ్చిన సాధారణ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి గెలవలేదు. ఈ పార్టీ నుంచి పోటీ చేసిన పలువురికి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.
 
పార్టీలో చేరిన తర్వాత కిరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడానికి కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందని, విభజన చట్టాన్ని అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.
 
కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన నేతలతోనూ తాను మాట్లాడుతున్నానని, రాహుల్‌ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి ప్రయత్నం చేస్తామని కిరణ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నాయకత్వంలోనే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుందని, తనకు కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ గుర్తింపు వచ్చిందని తెలిపారు.