సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 19 జూన్ 2019 (14:27 IST)

క్యూలో నిలబడమంటే.. రైల్వే పోలీసును చితక్కొట్టారు.. (Video)

క్యూలో నిలబడమని చెప్పినందుకు.. ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. టిక్కెట్ కోసం నిల్చున్న ఓ యువకుడిని లైన్లో నిలబడమని చెప్పిన ఓ రైల్వే పోలీసుపై ఆ యువకుడు తీవ్రంగా దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. యూపీలోని తియోరియా సాదర్ రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ కోసం ప్రయాణీకులు క్యూలో నిలబడ్డారు. ఆ సమయంలో ముగ్గురు యువకులు మాత్రం లైన్లో నిలబడకుండా క్యూ మధ్య దూరి టిక్కెట్లు తీసుకోవాలనుకున్నారు. 
 
దీన్ని గమనించిన ఓ రైల్వే పోలీస్ ఆ యువకులను లైన్లో నిలబడమని మందలించాడు. దీంతో పోలీసుతో ఆ యువకులు వాదనకు దిగారు. ఆపై పోలీసుపై యువకులు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రైల్వే పోలీసుపై యువకుల దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.