శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (14:24 IST)

కాంగ్రెస్‌కు షాక్.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన అంబరీష్

కాంగ్రెస్ పార్టీకి తేరుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, సినీ నటుడు అంబరీష్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే నెల 12వ తేదీన కర్ణాటక రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో అంబర

కాంగ్రెస్ పార్టీకి తేరుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, సినీ నటుడు అంబరీష్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే నెల 12వ తేదీన కర్ణాటక రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో అంబరీష్ ఏకంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం గమనార్హం.
 
నిజానికి ఈ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. అయితే, మాండ్యా నుంచి పోటీ చేయాలని కోరగా, ఆయన నిరాకరించారు. అలాగే, వయోభారం, అనారోగ్యమే కారణంగా ఎన్నికల ప్రచారంలోనూ తాను పాల్గొననని అంబరీష్ స్పష్టంచేశారు. రాజకీయాలకు అంబరీష్ గుడ్‌బై చెప్పడటంతో చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని బరిలోకి దింపింది.
 
అభ్యర్థిగా పేరు ఖరారు చేసిన తర్వాత కూడా అంబరీష్ బీఫామ్ అందుకునేందుకు విముఖత చూపించారు. షరతులు విధిస్తూ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానంటేనే బీఫామ్ తీసుకుంటానని అంబరీష్ చెప్పారని కూడా ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. 
 
పార్టీ పెద్దలు వరుసగా సమావేశమైనా అంబరీష్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తాజాగా రాజకీయాలకు గుబ్‌బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. అంబరీష్ రాజీనామాతో మాండ్యా స్థానంలోకాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు.