సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (12:14 IST)

రామ్ గోపాల్ వర్మను రాధికా ఆప్టే అంత మాటనేసిందా?

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ ముందుండే రామ్ గోపాల్ వర్మకు బోల్డ్ యాక్ట్రస్‌గా పేరుకొట్టేసిన రాధికా ఆప్టే ఝలక్ ఇచ్చింది. ''రక్తచరిత్ర'' సినిమాతో టాలీవుడ్‌కు రాధికా ఆప్టేను వర్మ పరిచయం చేసిన సంగత

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ ముందుండే రామ్ గోపాల్ వర్మకు బోల్డ్ యాక్ట్రస్‌గా పేరుకొట్టేసిన రాధికా ఆప్టే ఝలక్ ఇచ్చింది.  ''రక్తచరిత్ర'' సినిమాతో టాలీవుడ్‌కు రాధికా ఆప్టేను వర్మ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ తీసుకోవాల్సిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మేనని రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఓ టాక్ షోలో పాల్గొన్న రాధికా ఆప్టే.. ఇప్పుడున్న నటులు, దర్శకుల్లో ఎవరు రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నారు.. అనే ప్రశ్నకు రాధికా ఆప్టే ఇలా సమాధానం ఇచ్చింది. దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ రిటైర్మెంట్ తీసుకోవాలని తెలిపింది. ప్రస్తుతం రాధికా ఆప్టే ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాధికా ఆప్టే ఇంటర్వ్యూ ఇచ్చిన షో శనివారం ఓ టీవీలో ప్రసారం కానుంది.