King Cobra Viral Video: నడి రోడ్డుపై కింగ్ కోబ్రా.. ఆ వ్యక్తి తోక పట్టుకుని..? (video)
King Cobra Viral Video: నడి రోడ్డుపై కింగ్ కోబ్రాతో విన్యాసాలు చేసిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మధ్య కింగ్ కోబ్రాకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాతో విన్యాసాలకు దిగాడు. ఆ పాముతో యమా డేంజర్ అని తెలిసి కూడా ఆ పాముతో ఆడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ పెద్ద కింగ్ కోబ్రా రోడ్డుపైకి వచ్చింది. ఓ వ్యక్తి దాని వద్దకు వెళ్లి తోక పట్టుకుని పక్కకు లాగగానే కోబ్రా కాటేసేందుకు ప్రయత్నించింది. అయినా ఆ వ్యక్తి ఎలాంటి వణుకు లేకుండా ఆ పాముతో విన్యాసాలు చేస్తూ కనిపించారు. కోబ్రాతో ఆ వ్యక్తి చేస్తున్న నిర్వాకం చూసి వాహనదారులు షాక్ అయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.