గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2025 (20:18 IST)

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

Madhavi Latha
Madhavi Latha
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఓన్లీ లేడీస్ పార్టీ వ్యవహారం ప్రస్తుతం రచ్చ రచ్చ అవుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ అన్నట్టు వార్ జరుగుతోంది. ఓన్లీ లేడీస్ పార్టీకి వెళ్ళొద్దని ఆమె మహిళలకు అప్పీల్ చేశారు. ఆమె వ్యాఖ్యలపై జెసి ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
మాధవి లతను ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మాధవి లత పై జేసీ అనుచరులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టిడిపి మహిళా కౌన్సిలర్లు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని కోరారు. తాజాగా జెసి ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల పైన సినీనటి, బిజెపి నేత మాధవి లత స్పందించారు. 
 
"నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు. మహిళల మాన ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను అంటూ మాధవి లత వెల్లడించారు. ఒంటరిగానైనా పోరాడతాను" అన్నారు. సినిమాలలో ఉన్న వాళ్లంతా ప్రాస్టిట్యూట్లని ఆయన చెప్పారు కాబట్టి ఆ జిల్లా నుంచి ఎవరు ఇండస్ట్రీకి రావద్దు అంటూ మాధవి లత సూచించారు. మహిళలు సురక్షితంగా ఉండాలని చెప్పడమే తాను చేసిన తప్పా అంటూ ఆమె ప్రశ్నించారు. వయసులో పెద్దవారైనా ఆయన గౌరవప్రదమైన మాటలు మాట్లాడాలని, అసభ్య పదాలు వాడడం దారుణమని మండిపడ్డారు. తెర మీద కనిపించే మహిళలు క్యారెక్టర్‌లెస్, గలీజ్ వాళ్లు అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు.. మరి తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి ఎవరూ సినిమా రంగంలోకి రాకండి అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మాధవీ లత.