శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (11:12 IST)

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం... స్పీకర్‌కు ఐదు పార్టీల నోటీసులు

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. స్పీకర్‌కు ఐదు పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. తొలుత కేవలం టీడీపీ, వైసీపీలు మాత్రమే అవిశ్వాస తీర్మానం ఇవ్వగా... చివ

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. స్పీకర్‌కు ఐదు పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. తొలుత కేవలం టీడీపీ, వైసీపీలు మాత్రమే అవిశ్వాస తీర్మానం ఇవ్వగా... చివర్లో కాంగ్రెస్ కూడా ఆ జాబితాలో చేరింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సీపీఎం, ఆర్ఎస్పీ కూడా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా సొంతంగా మరో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో, మంగళవారం పార్లమెంటులో కేంద్రంపై ముప్పేట దాడికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
 
మరోవైపు, ఇన్ని రోజులు రిజర్వేషన్లపై పోరాడుతూ, అవిశ్వాసంపై చర్చకు అంతరాయం కలిగించిన టీఆర్ఎస్ పార్టీ సైతం తన వైఖరి మార్చుకుంది. అవిశ్వాసంపై చర్చకు తాము సహకరిస్తామని ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. ఇకపోతే కావేరీ బోర్డు గురించి అన్నాడీఎంకే ఎంపీలు యధావిధిగా తమ ఆందోళనలకు కొనసాగిస్తున్నారు. మరోవైపు, అవిశ్వాసం తీర్మానాలను లోక్‍సభలో మంగళవారం అడ్మిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నారు.