బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 జులై 2020 (18:49 IST)

బంగారంతో చేయించిన మాస్కు వేశాడు, ఎంతో తెలిస్తే షాకే...

బంగారం మాస్కు ధరించాడు
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అయింది. ఐతే ఈ మాస్కుల ధరలు వాటివాటి నాణ్యతను బట్టి రకరకాలుగా వుంటున్నాయి. కరోనావైరస్‌ను అడ్డుకునే మాస్కు ఏదయా అంటే... ఎన్-95 అనేది వైద్యులు మాట. కానీ ఈ మాస్కులను ఎంతమంది ధరిస్తున్నారన్నది పెద్దప్రశ్న. ఎందుకంటే... చాలామంది మాస్కులకు బదులు ఖర్చీఫ్‌లను, ద్విచక్రవాహనాలపై వెళ్లేటపుడు పెట్టుకునే మాస్కులను, ఇంకా రకరకాలవి వాడుతున్నారు. 
 
ఇక అసలు విషయానికి వస్తే పుణె జిల్లాలోని పింప్రీ-చింద్వాడకు చెందిన శంకర్ కురాడే రొటీన్ మాస్కులకు బదులు వెరైటీగా మాస్కు చేయించుకోవాలనుకున్నాడు. అసలే అతడికి బంగారంతో చేయించిన ఆభరణాలు అంటే మహాపిచ్చి, మెడలో, చేతులకు కావల్సిన మోతాదులో బంగార నగలు ధరిస్తుంటాడు. కాబట్టి మాస్కు కూడా బంగారంతో చేయించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే బంగారు నగల దుకాణాలను సంప్రదించాడు.
 
మాస్కుకు అయ్యే ఖర్చు ఏడెనిమిది లక్షల దాటుతుందని చెప్పగా చివరికి ఓ బంగారం నగల షాపువారితో రూ. 2 ల‌క్ష‌ల 89 వేల ఖ‌రీదైన గోల్డెన్ మాస్క్‌ను త‌యారు చేయించుకున్నాడు. ఐదున్న‌ర తులాల బంగారం వాడిన‌ ఈ మాస్కును ధరించిన శంకర్ దాన్ని సోషల్ మీడియాలో వదిలాడు. ఇకనేం అది కాస్తా ట్రెండింగ్ అయింది. మరో విషయం ఏంటంటే... శంకర్ రోజూ 3 కిలోల బరువుండే బంగారు గొలుసులు, ఉంగరాలు తదితర ఆభరణాలు ధరిస్తాడట.