సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (17:54 IST)

పవన్ కల్యాణ్ మ్యాటర్ డిఫరెంట్.. ఖబడ్దార్ కల్యాణి, గాయత్రి: శ్రీరెడ్డి వార్నింగ్

శ్రీరెడ్డికి సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను సినీ నటి కళ్యాణి లీక్ చేసింది. శ్రీరెడ్డి అసలు పేరు విమల అని.. ఈ పెళ్లి కాని విమలకు శ్రీ చైతన్యలో ఇంటర్ చదువుతున్న కూతురుందని కళ్యాణి చెప్పింది.

శ్రీరెడ్డికి సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను సినీ నటి కళ్యాణి లీక్ చేసింది. శ్రీరెడ్డి అసలు పేరు విమల అని.. ఈ పెళ్లి కాని విమలకు శ్రీ చైతన్యలో ఇంటర్ చదువుతున్న కూతురుందని కళ్యాణి చెప్పింది.


విమలకు అమ్మతో పది సంవత్సరాలు నుండి సంబంధం లేకపోతే కొంత కాలం క్రితం కూకట్‌పల్లిలో లోథా మెరిడియన్‌లో కోటిన్నర విలువగల ప్లాట్‌లో ఇద్దరు ఎలా గృహప్రవేశం చేశారని ప్రశ్నించారు. అసలు పెళ్లి కాకుండానే ఇంటర్ చదివే అమ్మాయికి శ్రీరెడ్డి ఎలా తల్లి అయ్యిందిని.. ఖరీదైన కార్లు కొనేందుకు ఆమెకు డబ్బులెలా వచ్చాయని కళ్యాణి అడిగింది. దీనిపై శ్రీరెడ్డి స్పందించింది.
 
తన వ్యక్తిగత జీవితంపై అసత్యాలతో కూడిన ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని.. ఈ వ్యవహారంపై మాటలుండవని.. కేసులే వుంటాయని హెచ్చరించింది. తనను మానసికంగా హింసించే హక్కు, విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదని.. కబడ్దార్ కల్యాణి, గాయత్రి.. త్వరలో మరికొన్ని పేర్లు చెబుతానంటూ శ్రీరెడ్డి వెల్లడించింది.
 
అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి శ్రీరెడ్డి స్పందించింది. ''పవన్ కల్యాణ్ మ్యాటర్ డిఫరెంట్ అని.. ఆయనకు నేడు క్షమాపణ చెబుతామని శ్రీరెడ్డి తెలిపింది. తన గురించి మాట్లాడితే తాట తీస్తానని ఫేస్‌బుక్ ద్వారా హెచ్చరించింది.

ఈ రోజు వరకూ నన్ను ఇరిటేట్ చేసినా, ఎక్స్‌ప్లాయిట్ చేసినా వారిపై మాత్రమే నేను నిందారోపణ చేశా. అనవసరంగా నా పర్సనల్ లైఫ్‌పైన ఎవరు మాట్లాడినా తాట తీస్తా.. లీగల్‌గా ఇరుక్కోకుండా ఉండటం మంచిది.

కేసులు పెట్టిన తర్వాత ఏడిస్తే ఉపయోగం లేదు. పవన్ మ్యాటర్ పూర్తిగా వేరు. నేడు దీనిపై మేము వివరణ ఇస్తాం అలాగే క్షమాపణ కూడా చెబుతాం'' అని శ్రీరెడ్డి తెలిపింది.