శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (09:31 IST)

మీరందరూ కలిసి ఓ సోదరి బట్టలు ఇప్పించేలా ప్రోత్సహిస్తే..?: పవన్

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీడియాపై వరుస ట్వీట్లతో ఏకిపారేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలపై పవన్ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం టీవీ9 అధినేత శ్రీ

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీడియాపై వరుస ట్వీట్లతో ఏకిపారేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలపై పవన్ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం టీవీ9 అధినేత శ్రీనిరాజు, సీఈవో రవిప్రకాశ్‌పై విరుచుకుపడిన పవన్ ఆ తర్వాత మరో సంచలన ప్రకటన చేశారు. 
 
గత ఆరు నెలల పాటు తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు జరపాల్సిందిగా తెలంగా పోలీసులను జనసేనాని విజ్ఞప్తి చేశారు. అదే జరిగితే.. తనను అప్రతిష్ట పాలు చేసిన పెద్దల బాగోతాలు బయటకు వస్తాయని.. ఆ దర్యాప్తు క్రమంగా అమరావతి వరకు దారితీస్తుందన్నారు. ఇలా చేస్తే సమాజంలోని కుళ్లు కూడా బయటపడుతుందన్నారు. అందరూ కలిసి నడిరోడ్డుపై బట్టలు ఇప్పించేలా ప్రోత్సహిస్తే.. దానిని మీడియా చూపించిందని.. అన్నీ షోలకు అదే కారణమైందని పవన్ అన్నాడు. 
 
అంతకుముందు ట్వీట్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గత రాత్రి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫొటో పోస్టు చేసి భోజనంలో కాస్తంత సంస్కారాన్ని కూడా వడ్డించమని కుమారుడికి సలహా ఇచ్చి గుడ్ నైట్ చెప్పారు. పవన్ మళ్లీ ఉదయాన్నే వరుస ట్వీట్లతో ముందుకొచ్చారు. టీవీ 9 సీఈవో రవి ప్రకాశ్‌కు గుడ్ మార్నింగ్ చెబుతూ రవిప్రకాశ్ దంపతులు పూజలో ఉన్న ఫొటోను పోస్టు చేశారు. ''నువ్వు దేవుడిని, పూజలను కూడా నమ్ముతావా'' అని క్యాప్షన్ తగిలించి ఎద్దేవా చేశారు.