శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: సోమవారం, 23 ఏప్రియల్ 2018 (19:21 IST)

పవన్ కళ్యాణ్‌ సహనం సహనం... పడ్డవాడు చెడిపోయినట్లు చరిత్రలో లేదు...

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ సహనం కోల్పోతున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి నాయకుడికి సహనం అవసరం. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆచితూచి స్పందించాలే తప్ప.. వెంటనే నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవన్నది విశ్లేషకుల భావ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ సహనం కోల్పోతున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి నాయకుడికి సహనం అవసరం. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆచితూచి స్పందించాలే తప్ప.. వెంటనే నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవన్నది విశ్లేషకుల భావన. నాయకులు, కార్యకర్తలకు రెచ్చిపోకూడదని, సహనంతో ఉండాలని చెప్పాల్సిన నాయకుడే ఆగ్రహంతో ఊగిపోతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
శ్రీరెడ్డి వ్యవహారంతో కొన్ని టివి ఛానళ్ళు పదేపదే ప్రసారం చేయడం, దాంతో పాటు పవన్ కళ్యాణ్‌ కుటుంబాన్ని శ్రీరెడ్డి రోడ్డుపైకి లాగిన విషయం తెలిసిందే. పదేపదే శ్రీరెడ్డి-పవన్ కళ్యాణ్‌ వ్యవహారం మీడియాలో ప్రధాన వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్‌‌కు చిర్రెత్తు కొచ్చింది. ఫిలిం ఛాంబర్‌కు వెళ్లి హడావిడి చేశారు. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. 
 
ఇదిలా జరుగుతుండగానే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టివి ఛానళ్ళకు సంబంధించిన ఓబి, కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. మీడియా ఛానళ్ళ ప్రతినిధులను వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా ఏకిపారేస్తున్నారు. అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన పవన్ కళ్యాణే రెచ్చిపోతుంటే ఎలా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
 
పవన్ కళ్యాణ్‌ ఆవేశపడటం కన్నా ఆలోచనతో ముందుకు వెళితేనే మంచిదంటున్నారు. మరి పవన్ కళ్యాణ్‌ ఆవేశంగా ముందుకు వెళతారా.. లేకుంటే దుందుడుకుతనంతోనే వ్యవహరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. పెద్దలు చెప్పినట్లు ఓర్పు, సహనాలే విజయాలకు బాటలవుతాయి. పడ్డవాడు చెడిపోయినట్లు చరిత్రలో లేదు మరి.