టిడిపిలోకి మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి... ఏ పదవిస్తారో తెలుసా..?
మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారా.. వచ్చే ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయనున్నారా.. .టిడిపిలోకి కిరణ్ వస్తే తీసుకునేందుకు సిఎం సిద్థంగా ఉన్నారా.. కిరణ్ పార్టీలోకి వస్తే నాయకులు ఒప్పుకుంటారా... ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ
మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారా.. వచ్చే ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయనున్నారా... టిడిపిలోకి కిరణ్ వస్తే తీసుకునేందుకు సిఎం సిద్థంగా ఉన్నారా.. కిరణ్ పార్టీలోకి వస్తే నాయకులు ఒప్పుకుంటారా... ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ల మధ్య నిజంగానే రహస్య చర్చలు జరిగాయా.. రసకందాయంగా చిత్తూరు జిల్లా రాజకీయాలు మారిపోయాయి.
రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యేగాను, శాసనసభ స్పీకర్ గా, చీఫ్ విప్ గాను పనిచేసిన అనుభవం కిరణ్ కుమార్ రెడ్డిది. చిత్తూరుజిల్లా కలికిరి మండలం నగరిపల్లె కిరణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం. తండ్రి నల్లారి అమరనాథ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణుకు పుచ్చుకున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి..ఆయన సోదరులు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి, తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిలు చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు.
ముఖ్యమంత్రిగా పనిచేసిన తరువాత రాష్ట్ర విభజన జరిగిన చివరకు కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు కిరణ్. ఆ తరువాత జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీపెట్టి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు కిరణ్. చివరకు చతికిలబడి రాజకీయాలనే పూర్తిగా వదిలేశారు. కొన్ని నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి జనసేనలోను, కాంగ్రెస్ పార్టీలోను చేరుతారన్న ప్రచారం జరిగింది. తన సన్నిహితులు, శ్రేయోభిలాషులతో సమావేశమైన కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో చేరాలో కార్యకర్తలనే సలహా అడిగారు. ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.
కిరణ్ ఆలోచనలో ఉండగానే ఆయన తమ్ముడు ఒకడుగు ముందుకేసి తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ్ముడు టిడిపిలో చేరడం ఏ మాత్రం ఇష్టం లేక అన్న కిరణ్ విభేదిస్తూ వచ్చారు. బాబు అవకాశవాది..అవసరాన్ని ఉపయోగించి వదిలేస్తారని తమ్ముడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా కిషోర్ కుమార్ రెడ్డికి రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని అప్పజెప్పారు ముఖ్యమంత్రి. దీంతో కిషోర్ కుమార్ రెడ్డి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన అన్న కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఒప్పించి టిడిపిలోకి తీసుకొచ్చి రాజంపేట ఎంపిగా పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు కిషోర్ కుమార్ రెడ్డి. పార్టీలో తనకు సముచిత స్థానం ఇస్తే తెలుగుదేశంలో చేరేందుకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా సిద్థంగా ఉన్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి టిడిపిలో వస్తే పార్టీ మరింత పటిష్టమయ్యే అవకాశం ఉందంటున్నారు చిత్తూరు జిల్లాలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు.