శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: బుధవారం, 17 జూన్ 2020 (17:06 IST)

కల్నల్ సంతోష్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శ్రీ సరస్వతి శిశుమందిర్ లక్షేట్టిపేట ఉపాధ్యాయులు

కల్నల్ సంతోష్ మరణానికి నివాళులు అర్పించిన తొలి గురువు శ్రీసరస్వతి శిశుమందిర్ ఉపాధ్యాయులు రాహుల రామన్న. సంతోష్‌కు విద్యాబుద్ధులు నేర్పే అవకాశం దక్కినందుకు గురువుగా గర్విస్తున్నానంటూ ఆనాటి జ్ఞాపకాలను‌ గుర్తు చేసుకున్నారు రాహుల రామన్న.
 
లక్షేట్టిపేట శ్రీసరస్వతి శిశుమందిర్‌లో నాలుగవ తరగతి వరకు విద్యనభ్యసించాడని గుర్తు చేసుకున్నారు సరస్వతి విద్యాలయం ఉపాధ్యాయులు. కల్నల్ సంతోష్ కుటుంబసభ్యులకి ప్రగాడ సానుభూతి తెలియజేసింది లక్షేట్టిపేట శ్రీ సరస్వతి విద్యాలయ పూర్వ విద్యార్థి పరిషత్.