బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (17:54 IST)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేరళ ఫోటో...?

పెళ్లికి ముందే ఫోటో ఆల్బమ్స్ తయారు చేసే ఫోటో స్టూడియోలు భారీగా పుట్టుకొచ్చాయి. తామెంతో కాలం నుంచి పరిచయమున్న ప్రేమికుల్లా, వధూవరులు ఫోటోలు దిగుతున్నారు. ఈ ఫోటోలు జీవితాంతం గుర్తుండిపోయేలా వుంటున్నాయి. తాజాగా, కేరళలోని కొచ్చి సమీపంలోని చెరతాల గ్రామంలో బిచూ ప్రతాపన్, ఇందు తీయించుకున్న పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వీరిద్దరూ పెరట్లోని ఓ చిన్న నీటి కుంటలో ఉరిలిగా పిలిచే తట్టలో పరస్పరం అభిముఖంగా ఒదిగి, పై నుంచి వర్షపు జల్లులు కురుస్తుండగా, తన్మయత్వంతో మునిగి తేలుతున్నట్లు ఓ ఫోటో తీయించుకున్నారు. దాదాపు పదేళ్లుగా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సిద్ధార్థ్, ఈ ఫోటో తీశాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.